![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -291 లో.. ధీరజ్ అన్న మాటలకి ప్రేమ బాధపడుతుంది. కాసేపటికి ప్రేమ బాధపడుతుంటే ధీరజ్ తన దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. ప్రేమ చాలా కోపంతో ఉంటుంది. ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఆ తర్వాత ధీరజ్ చెయ్ కి బ్లడ్ వస్తుంటే కట్టు కడుతుంది. నువ్వు గయ్యాళి గంపవే కాదు మంచిదానివి కూడా అని ధీరజ్ అంటాడు.
సారీ చెప్పినా కూడా ఎందుకు అలాగే ఉంటావని ధీరజ్ అంటాడు. కోపంగా ఉంటే కొట్టమని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ ఆ చెంప, ఈ చెంప వాయిస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మాత్రం నీ జోలికి రావద్దే తల్లి అని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేసి మా మావయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారని చెప్తుంది. ఆ తర్వాత వేదవతి కిచెన్ లో వంట చేస్తుంటే తిరుపతి వచ్చి మాట్లాడతాడు. ఏది ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్లు.. పుట్టింటి గురించి ఆలోచిన చేయొద్దని తిరుపతి అంటే తనకి అట్లకాడతో వాత పెడుతుంది వేదవతి.
మరొకవైపు రామరాజు దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. నర్మద వాళ్ళ నాన్న మాట్లాడింది మళ్ళీ గుర్తుచేస్తుంది. ఇల్లరికం రమ్మని అంత ధైర్యంగా అతను అన్నాడంటే కచ్చితంగా సాగర్ మనసులో ఆ ఆలోచన ఉండి ఉంటుందని శ్రీవల్లి అంటుంది. ఏం మాట్లాడుతున్నావని శ్రీవల్లిపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |